Nov 21,2019 12:40PM
హైదరాబాద్: కాసేపట్లో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. షరతుల్లేవంటే ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తామంటున్నారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో తప్ప మరెక్కడా సంతకం చేయబోమని కార్మికులు పేర్కొంటున్నారు. సమ్మెకు ముందున్న పరిస్థితులు జేఏసీ నేతలు కల్పించాలంటున్నారు. ప్రభుత్వం మాత్రం షరతులు తప్పవంటోంది. డ్యూటీలో ఎలా చేరాలో కూడా జేఏసీ నేతలే చెబుతారా? అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.