Nov 20,2019 08:44PM
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగే డే అండ్ నైట్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. పింక్ బాల్‌తో జరిగే ఈ టెస్ట్‌లో బంగ్లా బౌలర్లను ఎదురుకొనేందుకు కఠోరంగా సాధన చేస్తున్నారు. ఎక్కువగా స్వింగ్ అయ్యే బంతి, తేమను దృష్టిలో పెట్టుకొని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇందుకోసం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీం ఇండియా పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో విరాట్ ప్రాక్టీస్ చేశాడు. రోజు మొత్తం పింక్ బాల్‌తో షమీ.. విరాట్‌కు బౌలింగ్ చేశాడు. బంతిని నీటిలో ముంచి బౌలింగ్ చేస్తున్నారు. నవంబర్ 22వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.