Nov 20,2019 07:58PM
హైదరాబాద్: నగరం లోని సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో, స్థిరాస్తి రంగాలకు చెందిన సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృఫ్ణారావు ఇంటిపైనా ఐటీ దాడులు జరిగాయి. కృష్ణారావు కుమారుడు సందీప్ రావు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ప్రణీత్ గ్రూప్ సంస్థకు చెందిన కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. ప్రణీత్ గ్రూప్ సంస్థ ఎండీ నరేందర్, మరో ఐదుగురు డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.