Nov 20,2019 07:49PM
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకోవాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు జనసేన అధినేత పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. షరతులు పెట్టకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని టీఎస్ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యపై జనసేనాని ట్విట్టర్ వేదికగా స్పందించారు.