Nov 20,2019 04:26PM
హైదరాబాద్: గద్వాల కలెక్టరేట్ వద్ద పత్తి రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. విత్తన పత్తి ప్యాకెట్ ధరలు పెంచారని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను అదుపులోకి తీసుకుని పోలీసులు పీఎస్ కు తరలించారు.