Nov 20,2019 02:47PM
హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెస్ ఎంపి నుస్రత్ జహాన్ ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్తమా అటాక్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరిన కారణంగా ఆమె సోమవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ప్రజల అభిమానం, ఆశీస్సులతో తాను కోలుకున్నానని ఆమె ట్విటర్‌లో ఒక వీడియోను పోస్టు చేశారు.