Nov 20,2019 09:22AM
లోక్‌సభలో నేటి కార్యక్రమాలు ఈ కిందివిధంగా ఉన్నాయి.
- ప్రశ్నోత్తరాలు
- పత్రాల సమర్పణ : మంత్రులు జితేంద్ర సింగ్, సోమ్ ప్రకాశ్ తమ శాఖలకు చెందిన కొన్ని పత్రాలను సభకు సమర్పిస్తారు.
- మంత్రి ప్రకటన : భారత్‌నెట్ అమలు తీరుపై ఐటి స్టాండింగ్ కమిటీ నివేదికపై మంత్రి ధోత్రే సంజయ్ శామ్‌రావు ఒక ప్రకటన చేస్తారు.
తీర్మానం : ఈ నెల 19వ తేదీన సభలో ప్రవేశపెట్టిన బిఎసి నివేదికను సభ ఆమోదిస్తున్నదని ప్రహ్లాద్ జోషి, ఆధిర్ రంజన్ చౌధురి తీర్మానాన్ని ప్రవేశపెడతారు.
- నిబంధన 377 కింద ముఖ్యమైన అంశాలు చర్చిస్తారు.
- శాసన వ్యవహారాలు : చిట్ ఫండ్స్ (అమెండ్‌మెంట్) బిల్ 2019, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (అమెండ్‌మెంట్) బిల్ 2019లను సభలో ప్రవేశపెడతారు.
- నిబంధన 193 కింద చర్చ ఉంటుంది.