Nov 20,2019 09:11AM
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సీనియర్ సినీ నటుడు కృష్ణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. పవన్ తో పాటు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ స్టార్ వెంకటేశ్ లకు కూడా ఛాలెంజ్ విసిరారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కృష్ణ... తన నివాసం వద్దం మూడు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సంతోశ్ కుమార్ తో పాటు, సినీ నటుడు కాదంబరి కిరణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలని... మూడు మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.