Nov 20,2019 06:28AM
గుంటూరు : ప్రేమపేరుతో పెళ్ళిచేసుకుంటానని బాలికను మోసగించి లైంగికదాడి చేసిన ఘటనపై పట్టణంలో వెటర్నరీ వైద్యశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శివానాయక్‌పై కేసు నమోదయింది. బొల్లాపల్లి మండలానికి చెందిన బాలికతో శివానాయక్‌కు రెండేళ్లక్రితం పరిచయం ఏర్పడింది. గుంటూరులో ఇంటర్ చదువుతున్న బాలికను శివానాయక్ ప్రేమపేరుతో అప్పుడప్పుడు సత్తెనపల్లిలోని తన రూమ్‌కు తీసుకొచ్చి శారీరకంగా అనుభవించాడు. పెళ్ళి చేసుకోమని, బాలిక, ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినా అంగీకరించలేదు. దీంతో బాలిక, ఆమె కుటుంబ సభ్యులు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సీఐ విజయచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.