Nov 19,2019 09:35PM
హైదరాబాద్ : అక్రమ కేసులపై జనసేన నేతలు ఎస్పీని కలిశారు. దుర్గి మండలం ధర్మవరంలో జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఎస్పీకి తెలిపారు. వివాదంతో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టారని, జనసేన కార్యకర్తల తప్పుంటే తామే అప్పగిస్తామని చెప్పారు. అయితే ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని ఎస్పీ చెప్పినట్లు జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.