Nov 19,2019 09:31PM
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ అక్టోబరులో రికార్డుస్థాయిలో కార్లు డెలివరీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 9,49,800 వాహనాలను డెలివరీ చేసినట్టు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 12.2 శాతం అదనం. 2018లో ఇదే నెలలో 8,46,300 యూనిట్లను డెలివరీ చేసినట్టు పేర్కొంది. ఇక, జనవరి నుంచి అక్టోబరు వరకు తీసుకుంటే ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ 89,55,000 యూనిట్లను ప్రపంచవ్యాప్తంగా డెలివరీ చేసింది. అయితే, గతేడాది ఇదే సమయంలో పోలిస్తే ఇది 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం.
ఫోక్స్‌వ్యాగన్‌కు అత్యంత కీలక మార్కెట్ అయిన చైనాలో అక్టోబరు నెలలో 3,89,300 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 6.6 శాతం ఎక్కువ. అక్టోబరు 2018లో ఫోక్స్‌వ్యాగన్ చైనాలో 3,65,100 యూనిట్లు డెలివరీ చేసింది.