Nov 19,2019 04:56PM
ఇస్లామాబాద్: దాదాపు మూడు నెలల తర్వాత పాకిస్థాన్ మళ్లీ భారత్‌కు పోస్టల్ సేవలను మంగళవారం ప్రారంభించింది. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా వర్గాలు వివరాలను వెల్లడించాయి. ఃపాక్ నుంచి భారత్‌కు పోస్టల్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. పార్శిల్ సేవలు ఇంకా పునరుద్ధరించలేదు. కానీ ఈ సేవల పునరుద్ధరణకు సంబంధించి పాకిస్థాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదుః అని తెలిపాయి. భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి పాక్ ఎలాంటి నోటీసు లేకుండా భారత్‌కు పోస్టల్ సేవలను నిలిపివేసింది.