ఢాకా: మైదానంలో తోటి క్రికెటర్‌పై దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హొస్సైన్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు. బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఢాకా-ఖుల్నా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. షహదత్ బౌలింగ్ చేసేందుకు రెడీ అవుతుండగా సహచర ఆటగాడు అరాఫత్ సన్నీ బంతిని ఒకవైపే రుద్దవద్దని సూచించాడు. అలా రుద్ది ఒకవైపే షైన్ చేయొద్దని చెప్పడంతో షహదత్ మండిపడ్డాడు. అంతేకాదు, నేరుగా అతడి వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మైదానంలోని ఇతర ఆటగాళ్లు వెంటనే స్పందించారు. ఇద్దరినీ విడదీసి సర్ది చెప్పారు. అయితే ఈ ఘటనపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షహదత్‌పై ఏడాదిపాటు నిషేధం విధించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. అయితే అతనిపై ఏడాది కాదు.. ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇందులో రెండేళ్లు సస్పెండ్ చేసింది. ఐదు సంవత్సరాలతో పాటు నిషేధంతో పాటు మూడు లక్షల టాకాల జరిమానా కూడా విధించింది. అయితే ఈ నిషేధాన్ని అంగీకరిస్తున్నట్లు షహదత్ ప్రకటించాడు. ఈ శిక్షను మ్యాచ్ రిఫరీ విధించి.. ఆ తర్వాత పరిశీలన నిమిత్తం బోర్డు టెక్నికల్ కమిటీకి పంపించారు. బోర్డు ఆటగాడికి నిషేధం, జరిమానా విధించాన్ని ఆమోదించింది.
Nov 19,2019 04:24PM