Nov 19,2019 03:47PM
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజు పెంపును ఉపసంహరించుకోవాలంటూ సోమవారం జవహార్‌లాల్ నెహ్రూ విద్యార్థులు చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. కాగా సోమవారం నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. జోర్ భాగ్ సమీపంలోని సఫ్‌దుర్గ్ టూంబ్ సమీపంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేసారు.