Nov 19,2019 03:27PM
ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు ఖాతాదారులు నేడు బొంబే హైకోర్టు ఎదుట ఆందోళన నిర్వహించారు. ఖాతాదారుల ప్రయోజనాలను రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్బీఐ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.