హైదరాబాద్: తెలంగాణలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా గిరిజన ఆర్దిక సహకరా సంస్థ (ట్రైకార్) భారీఎత్తున నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం జరిగిన ట్రైకార్ మూడవ పాలక మండలి సమావేశంలో గిరిజన పథకాలకు రూ.213 కోట్లు కేటాయించాలని తీర్మానించారు. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి బెన్‌హర్ మహేశ్‌దత్ ఎక్కా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ట్రైకార్ చేపడుతున్న వివిధ గిరిజన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం 2019-20 ఆర్ధిక సంవత్సరంలో గిరిజన పథకాలకు రూ.213.67 కోట్ల రూపాయల ఆర్దిక సాయం అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. ఈ సబ్సిడీ మొత్తాన్ని 21,420 మంది గిరిజనులు లబ్ధి పొందనున్నారు. సీఎం ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ , ఇన్నోవేషన్ స్కీమ్, రూరల్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లాన్, డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్, రైతు ఉత్పాదక సంస్థలు, నైపుణ్యాల అభివృద్ధి, సీఎం గిరి వికాస్ వంటి పథకాల ద్వారా గిరిజనులకు గిరిజన సంక్షేమశాఖ ఆర్ధిక సాయం అందించనున్నంది.
Nov 15,2019 04:49PM