Nov 15,2019 04:27PM
పెద్దపల్లి: అవినీతికి పాల్పడుతున్న వ్యవసాయశాఖ ఏడీ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన పెద్దపల్లిలో చోటుచేసుకుంది. పెద్దపల్లి వ్యవసాయశాఖ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏడీ కృష్ణారెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఎరువుల దుకాణం అనుమతి కోసం ఓ వ్యాపారి వద్ద ఏడీ లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.