Nov 15,2019 12:26PM
విశాఖ: బాలలహక్కులు - చట్టాలు అనే అంశంపై విశాఖలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలన్నారు. బాలలపై అత్యాచారాలు చేసిన వాళ్లను భూమిపై లేకుండా చేయాలన్నారు. అప్పుడే బాలలకు న్యాయం జరుగుతుందన్నారు. బాలల రక్షణ
హక్కులపై శాసనసభలో చర్చిస్తామని తమ్మినేని సీతారాం తెలిపారు. పిల్లల హక్కుల కంటే... పెద్దల ఆరాచకాలపై చర్చ జరగాలన్నారు. ప్రభుత్వాలు పిల్లల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. పిల్లల హక్కులు కాపాడాలని.. వారికి స్వేచ్ఛ ఉండాలని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.