Nov 14,2019 10:53PM
విజయవాడ: గుణదలలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్‌కి బదులుగా డ్రైవర్ ఎక్సలేటర్ తొక్కాడు. దీంతో లారీ ఒక్కసారిగా వాహనాలపైకి దూసుకెళ్లింది. స్కూల్ వ్యాన్‌తో పాటు 2 కార్లు, 3 బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ మద్యం సేవించి నడిపినట్లు పోలీసులు గుర్తించారు.