ఢిల్లీ: ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్ జీడీపీ వృద్ధిరేటును తగ్గించింది. 2018లో 7.4శాతం వృద్ధిరేటు సాధించవచ్చని వేసిన అంచనాల్లో మార్పులు చేసింది. తాజా పరిస్థితులను బట్టి వృద్ధిరేటు 5.6శాతం మాత్రం ఉండవచ్చని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినిమయ డిమాండ్‌ను ఏ మాత్రం పెంచలేవని పేర్కొంది. భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాల్లో మార్పులు చేస్తున్నాం. భారత్‌లో జీడీపీ వేగం తగ్గుతుందని అంచనావేస్తున్నాం. ఇది 2019లో 5.6శాతం ఉండవచ్చు. 2018లో 7.4శాతంగా వేసిన అంచనాల్లో మార్పులు చేస్తున్నాం. భారత ఆర్థిక మందగమనం అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు ఉండనుంది. ప్రభుత్వం తీసుకొన్న చర్యల్లో డిమాండే ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తి అని మూడీస్ పేర్కొంది. ఇప్పటికే అక్టోబర10న మూడీస్ భారత ఆర్థిక వృద్ధిరేటును 6.2శాతం నుంచి తగ్గించి 5.8శాతానికి చేర్చింది. భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను మూడీస్ తగ్గించింది. స్థిరం నుంచి ప్రతికూలం రేటింగ్‌ను ఇచ్చింది. ముఖ్యం దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో ఇది వృద్ధిరేటుపై పడుతోందని అభిప్రాయపడింది.
Nov 14,2019 04:59PM