హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్‌లో నిన్న జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లోకో పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నదని కేర్ హాస్పిటల్(నాంపల్లి) సూపరింటెండెంట్ డాక్టర్ సుష్మ తెలిపారు. లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఆమె తెలిపింది. ఆయనకు చాలా క్రష్ ఇంజూరీస్ ఉన్నాయనీ, కిడ్నీలు కూడా పాడయ్యాయని తెలిపిన డాక్టర్.. ఆయన షాక్‌లో ఉన్నట్లు తెలిపారు. ఆయన కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందనీ, యూరిన్ అవుట్‌పుట్ కూడా బాగా తగ్గినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం అతనికి వాస్క్యులర్ ట్రీట్‌మెంట్ జరుగుతోందని డాక్టర్ తెలిపారు. అతడికి ఇప్పుడే ఆపరేషన్ చేయలేమనీ.. అతడు స్పృహలోకి రావాలని వారు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మిగితా ఐదుగురు ప్రయాణీకులకు చికిత్స కొనసాగుతుందని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమె తెలియజేశారు. లోకోపైలట్ చంద్రశేఖర్ శరీరమంతా గాయాలతో ఉంది. అతనికి వాస్క్యులర్ ట్రీట్‌మెంట్‌తో పాటు పాలిట్రోమా ట్రీట్‌మెంట్ జరుగుతుందనీ, ప్రత్యేక వైద్యబృందంతో చికిత్స కొనసాగిస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా, వెంటిలేటర్‌పై ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటేనే ఆపరేషన్ చేస్తామని ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు.
Nov 12,2019 07:14PM