హైదరాబాద్: అనంతపురంకు చెందిన స్వప్న కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె విషయం తెలుసుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం స్వప్న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు పొందుతోంది. తాజాగా స్వప్నను.. బాలయ్య పరామర్శించారు. ఎంతో ఆప్యాయంగా ఆ విద్యార్థినితో మాట్లాడిన ఆయన భయపడాల్సిన పనిలేదంటూ ధైర్యం చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి ఆమె ఆరోగ్య స్థితి వివరాలు తెలుసుకున్నారు. బాలయ్య ఆత్మీయత చూసి ఆ విద్యార్థిని ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. కాగా మరికొన్నిరోజుల్లో స్వప్నకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఆమెను పరామర్శించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయన స్వప్నకు పలు కానుకలు కూడా అందించారు.
Nov 12,2019 05:59PM