Nov 12,2019 11:22AM
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సారవలో కసాయి తండ్రి ఎలీషా పైశాచికత్వం వెలుగుచూసింది. ఇద్దరు కూతుళ్ళను చిత్రహింసలు పెట్టిన ఆ దుర్మార్గుడు వీడియోలు తీశాడు. అనంతరం వాటిని గల్ఫ్‌లో ఉన్న తన భార్యకు పంపి ఎక్కువ డబ్బు పంపాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. మీ ఇద్దరూ చనిపోవాలని పిల్లలకు తండ్రి డెడ్‌లైన్ పెట్టాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కసాయి తండ్రి దుర్మార్గం బయటికొచ్చింది. ఇద్దరు పిల్లల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆ ఇద్దరు పిల్లలను పోలీసులు వారి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.