Oct 23,2019 08:14PM
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ఏబీఎన్ ఛానెల్ ప్రసారాల నిలిపివేతపై టీడీ శాట్ ఎంఎస్ వోలపై కొరడా ఝలిపించింది. ఒక్కో ఎంఎస్ వోకు ఐదువేల రూపాయల జరిమానా విధించింది. ఏడు రోజుల్లో జరిమానాను ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెల్లించాలని ఆదేశించింది. ప్రసారాలను పునరుద్ధరించాలని గతంలో టీడీ శాట్ ఇచ్చిన ఆదేశాలను ఎంఎస్ వోలు పాటించడంలో విఫలమైనందున ఏబీఎన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేసింది. దీన్ని విచారించిన కోర్టు ఈరోజు తీర్పును చెప్పింది. మొత్తం ఏడుగురు ఎంఎస్ వోలు తలా రూ.5వేలు జరిమానా చెల్లించాలని పేర్కొంది.