Oct 23,2019 04:57PM
న్యూఢిల్లీ: భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై సౌకర్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నాలుగు, నాలుగున్నర సంవత్సరాల్లో రైళ్లలో ప్రయాణించే వారికి వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 5150 రైల్వే స్టేషన్‌లలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తుచేసిన ఆయన వచ్చే సంవత్సరం చివరి నాటికి 6,500 స్టేషన్‌లకు ఈ సౌకర్యాన్ని విస్తరిస్తామన్నారు. రైళ్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించడమనేది క్లిష్టమైన సబ్జెక్ట్‌గా ఆయన అభివర్ణించారు. రైళ్లలో వైఫై పరికరాలు ఏర్పాటు చేయడానికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికత అవసరమన్నారు.