Oct 23,2019 03:12PM
బెంగళూరు : బెంగళూరులో అమృతా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళాశాలలో ఈ నెల 21న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం వేధింపులను భరించలేక ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపిస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కళాశాల తీసుకున్న నిర్ణయాలే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకునేలా చేసాయని వారు ఆరోపిస్తున్నారు.