Oct 23,2019 02:00PM
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 2 లక్షల 754 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపునకు 22 రౌండ్లు, 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్‌కు కౌంటింగ్ పరిశీలకుడు, అసిస్టెంట్ సూపర్‌వైజర్ ఉంటారు. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.