Oct 23,2019 01:45PM
ఇస్లామాబాద్ : ఆత్మాహుతి దాడితో భారత ప్రధాని నరేంద్ర మోడీని అంతం చేస్తానంటూ పాకిస్తాన్ సింగర్ రబీ పిర్జాదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మోడీని హిట్లర్‌గా అభివర్ణించిన ఆమె.. సూసైడ్ జాకెట్ ధరించిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ క్రమంలో భారత నెటిజన్లు ఆమె చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాకిస్తాన్‌కు ఉగ్రవాదం పెంచిపోషించడం మాత్రమే తెలుసు అని మరోసారి నిరూపితమైందని మండిపడుతున్నారు. మరికొంత మంది పాకిస్తాన్ సంప్రదాయ వస్త్రధారణలో చాలా అందంగా ఉన్నావంటూ రబీ తీరుపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలతో రబీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.