Oct 23,2019 11:42AM
హైదరాబాద్: మండలంలో అర్థం గ్రామ సమీపంలో మలుపు వద్ద నారాయణ పాఠశాల బస్సు అదుపుతప్పి కారును ఢీకొన్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొమరాడ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న నారాయణ ప్రైవేట్ పాఠశాల బస్సు, స్వామియువలస గేటు సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పి పార్వతీపురం నుంచి రాయగడకు వెళ్తున్న కారును ఎదురుగా బలంగా ఢీకొని పక్కనే ఉన్న చెరకు తోటలోకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయపడినవారిని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. స్కూల్ బస్సులో సుమారు 32 మంది పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పిల్లలెవరికీ ఎలాంటి గాయాలు తగలకపోవడంతో.. పాఠశాల యాజమాన్యం కొంతమేరకు ఊపిరిపీల్చుకుంది.