Oct 22,2019 05:23PM
విజయనగరం: గోతులమయంగా మారిన జాతీయ రహదారికి వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరుతూ.. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వర్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం షికారుగంజి జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వర్‌రావు మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా కేంద్రం నుంచి పార్వతీపురం దాటి ఒడిశాకు వెళ్లే వరకు కూడా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని తక్షణమే ఈ మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రయాణాలను సురక్షితంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.