Oct 22,2019 02:07PM
హైదరాబాద్ : ప్రపంచంలో ఎక్కడైనా భారత్ సిరీస్‌లు గెలుస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ (3-0) క్లీన్‌స్వీప్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లి మాట్లాడుతూ.. భారత్ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సిరీస్‌లు గెలువగలదన్నారు. ఈ సిరీస్ చాలా గొప్పగా సాగిందనీ, సిరీస్ విజయం సమిష్టిగా సాధించిందని కెప్టెన్ తెలిపారు.