Oct 22,2019 11:07AM
హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కరలేని కమెడియన్ ఆలీ. ఎప్పుడూ సరదాగా అందరిని నవ్వించే ఆలీకి కోపం వచ్చింది. మీరేమైనా తోపులా అంటూ క్రిటిక్స్‌పై మండిపడ్డారు. సినిమా బాలేదని అనడానికి మీరు ఎవరు? కోన్ కిస్కా గొట్టాం గాళ్లు, మూర్ఖులు... అంటూ తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది 3 సినిమాకు నెగిటీవ్ రివ్యూలు రావడమే అందుకు కారణం. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి రేటింగులు దారుణంగా వచ్చాయి. ఆలీ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. చాలా గ్యాప్ తరువాత ఆలీ నటించిన సినిమా ఇదే కావడం దానికి నెగెటివ్ రివ్యూలు రావడంతో ఆలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మూర్ఖులు పనిగట్టుకుని సినిమాపై రాళ్లు విసురుతున్నారని, వారిని పట్టించుకోనని అలీ చెప్పుకొచ్చారు.