Oct 22,2019 10:39AM
ఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు బంగ్లా ప్రధాని షేక్ హసీనా కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్ కు వస్తున్నట్టు గంగూలీ తెలిపారు. మ్యాచ్ జరగబోయే ముందు ఆమెతో గంటను కొట్టి మ్యాచ్‌ను ప్రారంభించనున్నట్టు గంగూలీ వెల్లడించారు. ఈ మ్యాచ్ ను చూసేందుకు భారత ప్రధాని మోడీకి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం పంపిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.