Oct 21,2019 09:07PM
న్యూఢిల్లీ: వివో వి17 ప్రొ (8జీబీ ర్యామ్ం128 జీబీ స్టోరేజీ) ధర భారత్‌లో భారీగా తగ్గింది. నెల రోజుల క్రితం భారత్‌లో లాంచ్ చేసినప్పుడు దీని ధర రూ.29,990 కాగా, ఇప్పుడు రూ. 2,000 తగ్గించి రూ.27,990కే అందుబాటులోకి తీసుకొచ్చింది. 32 ఎంపీ డ్యూయల్ పాపప్ సెల్ఫీ కెమెరా, 48 ఎంపీ క్వాడ్‌కోర్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-షాప్, పేటీఎం మాల్, టాటా క్లిప్ తదితర వాటిలో తగ్గించిన ధరతో అందుబాటులో ఉంది.