Oct 21,2019 08:01PM
చెన్నై : తమిళనాడు వెటర్నరీ మరియు ఏనిమల్ సైన్సెస్ యూనివర్సిటీ సర్జన్స్.. ఓ ఆవు కడుపులో ఉన్న 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఆవు కడుపులో వ్యర్థాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ ఆవుకు 5 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ వ్యర్థాలతో పాటు రెండు స్క్రూలు, ఒక నాణెం కూడా ఉన్నట్లు సర్జన్లు చెప్పారు. శస్త్ర చికిత్స చేసిన నేపథ్యంలో ఆవుకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు.