Oct 21,2019 07:54PM
హైదరాబాద్ : హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైది రెడ్డి గెలుపు ఖాయమని ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. పోలింగ్ ముగిశాక ఆయన సైది రెడ్డి విజయం ఖాయమంటూ ట్వీట్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కష్టపడి పనిచేసిన, ప్రచారం చేసిన టీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.