Oct 21,2019 07:52PM
హైదరాబాద్ : భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గం సోమవారం ప్రమాణస్వీకారం చేసింది. సంఘం ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అసోసియేట్ అధ్యక్షునిగా జి. రాజేశ్వరరావు, కార్యదర్శిగా ఎస్. ప్రభాకర్ రెడ్డి, కోశాధికారిగా ఏ. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్దుల్ సాధిక్, ఉపాధ్యక్షులుగా రషీదా బేగం, కె. వెంకటేష్, జాయింట్ సెక్రటరీలుగా డి. సుదర్శన్, ఎం. రాజ్యలక్ష్మి, టి. ప్రదీప్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.