Oct 21,2019 05:54PM
హైదరాబాద్: విశాఖ మన్యంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం కిలగాడ వద్ద బోలెరో పిక్ అప్ వ్యానులో తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పాడేరు ప్రొహిబిషన్, అనకాపల్లి టాస్క్ ఫోర్స్, ఎక్సయిజ్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. గంజాయిని పాడేరు ఎక్సయిజ్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందన్నారు.