హైదరాబాద్ : మాస్, కమర్షియల్ దర్శకుడిగా ఏఆర్ మురుగదాస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందిస్తూ దక్షిణాదిని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా దర్బార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా దీనిని విడుదల చేయనున్న విషయం తెలిసిందే. కేవలం కమర్షియల్ చిత్రాలను మాత్రమే తెరకెక్కిస్తున్నారనే వాదనలు కూడా కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ నా గురించి ఎవరేమి మాట్లాడినా పట్టించుకోను. పనిపై మాత్రమే దృష్టి పెడతా. ఎందుకంటే ఈ రంగంలో శ్రమే పెట్టుబడి. శ్రమను మూలధనంగా పెడితే ఇక్కడ ఏదైనా సాధించవచ్ఛు కేవలం కమర్షియల్ దర్శకుడనే పేరును ఒక్క రోజులో మార్చగలను. నాపై విమర్శలు చేస్తున్నవారు.. చాలా ఖాళీగా ఉన్నారు. నాకు అంత సమయం లేదు. వందంతులు, విమర్శలు నా ఎదుగుదలను ఏమాత్రం అడ్డుకోలేవని చెప్పారు.
Oct 20,2019 12:43PM