Oct 20,2019 11:43AM
హైదరాబాద్: బీమా వైద్య సేవల విభాగం (ఐఎంఎస్) కుంభకోణంలో అరెస్టయిన జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ చంచల్‌గూడ మహిళా జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆదివారం నాడు వైద్యులు వెల్లడించారు. నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పద్మ ఆత్మహత్యాయత్నం చేయగా.. హుటాహుటిన జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఏం మాత్రలు వాడారన్నది మాత్రం ఇంతవరకూ క్లారిటీగా తెలియరాలేదు. మరోవైపు ఆమెను రక్తపరీక్ష కోసం వైద్యులు ల్యాబ్‌కు పంపారు.