Oct 19,2019 03:46PM
న్యూఢిల్లి : దేశంలో ఏడు న్యూక్లియర్ రియాక్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డిఎఇ) కార్యదర్శి కెఎన్ వ్యాస్ చెప్పారు. మరొక 17 న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ సాగుతోందని ఆయన అన్నారు. 2030 నాటికి మొత్తం 21 కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను నిర్మించాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫ్లీట్ మోడ్ విధానంలో కొత్త రియాక్టర్ల నిర్మాణం చేపడుతున్నామని వ్యాస్ చెప్పారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని ఆయన అన్నారు. ఎనర్జీ అవసరాల రీత్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాస్ పేర్కొన్నారు.