Oct 19,2019 03:24PM
హైదరాబాద్: విద్యుత్ కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీసు నిబంధనల అమలు, విద్యుత్ సంస్థల్లో నియామకమైన కార్మికులందరికీ పాత పెన్షన్ విధానం అమలుతో పాటు ఇతర డిమాండ్ల సాధనపై కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ కార్మిక సంఘం నేతలతో నగరంలోని విద్యుత్‌సౌధలో విద్యుత్ యాజమాన్యం నేడు చర్చలు చేపట్టింది. ఈ చర్చల్లో విద్యుత్ సంస్థల సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు. విద్యుత్ కార్మిక సంఘాల డిమాండ్లపై విద్యుత్ యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.