Oct 19,2019 12:10PM
సంగారెడ్డి: బంద్ నేపథ్యంలో సంగారెడ్డిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరయ్యేందుకు ముందుకు రాలేదు. బంద్‌లో భాగంగా డిపోవద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.