Oct 18,2019 04:50PM
హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలోని రిచ్చోడాలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ పాఠశాల వ్యాను అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు వ్యానులో మొత్తం 25 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం హోసంగాబాద్ జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు గాయపడిన సంగతి తెలిసిందే. పాఠశాల బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.