Oct 18,2019 04:14PM
ఖమ్మం: ఆర్టీసీ సమ్మెకు ప్రజల మద్దతు పెరుగుతోంది. ప్రభుత్వం సెప్టెంబరు జీతాలు కూడా ఇవ్వకున్నా.. ఆర్థిక ఇబ్బందుల్ని లెక్కచేయకుండా పోరాడుతున్న కార్మికులకు చేదోడుగా ముందుకొచ్చారు ఓ రిటైర్డ్ టీచర్. సమ్మె చేస్తున్న ఖమ్మం డిపో ఉద్యోగులకు 25 వేల రూపాయలు సాయంగా అందించారు మాజీ ప్రభుత్వ టీచర్ రేగులగడ్డ విజయకుమారి. ఖమ్మం డిపో జేఏసీకి ఈ డబ్బును విరాళంగా అందజేశారామె.
ఆర్టీసీ సమ్మె ప్రజలంతా మద్దతుగా ఉన్నారన్నారు విజయ కుమారి. ఆర్టీసీ కార్మికులంతా ఏకతాటిపై 14 రోజులుగా చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని అన్నారు. కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు తన వంతుగా ఈ ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పారామె. విజయ కుమారి సాయానికి ఆర్టీసీ జేఏసీ ధన్యవాదాలు తెలిపింది.