Oct 18,2019 03:05PM
నల్గొండ: రేపటి బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నార్కట్‌పల్లి బస్ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు యావత్ తెలంగాణ అండగా ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు. రేపటి తెలంగాణ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంస్థ ఆర్టీసీని కాపాడుకోవాలని కోరారు.