Oct 18,2019 03:02PM
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ రోజు ఎల్బీనగర్, సరూర్‌నగర్ చౌరస్తాలో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. కామినేని చౌరస్తాలో ఉన్న అభినందన్ గ్రాండ్ హోటల్‌కు అధికారులు రూ. లక్ష జరిమానా విధించారు. ట్రేడ్ లైసెన్స్ రిన్యూవల్ చేయకపోవడం, 50 మైక్రాన్‌ల కన్నా తక్కువున్న ప్లాస్టిక్‌ను ఉపయోగించడం, హోటల్ వ్యర్థాలను డ్రైనేజీలకు వదలడం వంటి తప్పులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం, ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.