Oct 18,2019 01:35PM
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న పారెస్ట్ బీట్ ఆఫీసర్ నెహ్రూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.