Oct 18,2019 12:43PM
బెంగళూరు : బెంగళూరులో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై స్థానికులు ధర్నా నిర్వహించారు. వర్తూరు, మరాఠాహళ్లి, కడుగొడి, కుందనహళ్లి ప్రాంతాలకు చెందిన ప్రజలు మరాఠాహళ్లి వంతెన వద్ద ధర్నా నిర్వహించారు. కనీస సదుపాయాలు కల్పించనందున సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.