Oct 18,2019 12:10PM
ఢిల్లీ: ప్రతీ ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోడీ సర్కారుకు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను మంత్రి సీతారామన్ ఖండించారు. అమెరికా టూర్‌లో ఉన్న ఆమె.. మన్మోహన్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. బ్యాంకింగ్ రంగానికి తమ ప్రభుత్వమే గాడిలో పెడుతోందని అన్నారు. బుధవారం కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. మాజీ మన్మోహన్ సింగ్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వీరి వల్లే మొండి బకాయిలు పెరిగినట్లు ఆమె చెప్పారు.